పడి పడి లేచే మనసు వీడియో సాంగ్ – కన్నుల పండుగలా ఉంది

padi padi leche manasu song released

వరుస విజయాలతో జోష్ మీదున్న హీరో శర్వానంద్, తన నేచురల్ నటనతో కట్టిపడేసే సాయి పల్లవి లు కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచే మనసు’. లై అనే సినిమాతో వరుస విజయాలతో ఉన్న నితిన్ కి మళ్ళీ ప్లాప్ ని పరిచయం చేసిన హను రాఘవపూడి ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే సంకల్పంతో ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ని ప్రేక్షకులకి చూపేందుకు సిద్ధం అవ్వబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21 న విడుదల అవ్వబోతుండగా, తాను ఈ సినిమాని ఎంతలా ఆకట్టుకునేలా తీసాడో ప్రేక్షకులకి చూపాలి అనుకున్నట్లుగా పడి పడి లేచే మనసు అనే టైటిల్ సాంగ్ వీడియో ప్రోమో ని విడుదల చేశాడు. హిమాలయాల్లో చిత్రీకరించిన ఈ సాంగ్ లో శర్వానంద్, సాయి పల్లవి లా మధ్య కెమిస్ట్రీ చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

Padi Padi Leche Manasu

ఈ ఇద్దరి డ్రెస్సింగ్, స్టైల్స్ దగ్గరనుండి ఎక్స్ప్రెషన్స్, లొకేషన్స్ వరకూ అన్నీ పర్ఫెక్ట్ గా ఎన్నుకొని మరీ తీశాడా ఈ వీడియో సాంగ్ అన్నట్లుగా ఉంది ఈ వీడియో ప్రోమో ని చూస్తుంటే.హను రాఘవపూడి తీసిన కృష్ణగాడి వీరప్రేమగాథ తరువాత మరోసారి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ పాట ని మళ్ళీ మళ్ళీ వినాలనే ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. వినడం ఎంతబాగుందో చూడటం మరింత బాగుంది అనిపించడం మరో విశేషం. బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్, సింధూరి విశాల్ తమ తమ మధురస్వరాలతో ప్రాణం పోశారు ఈ పాటకి. శర్వానంద్ ని ఇంత అందంగా ఎన్నడూ చూడలేదే అని మనం అనుకుంటామో, సాయి పల్లవి కూడా ఇదివరకు కనిపించనంత అందంగా ఈ పాటలో కనిపించింది. మీరు కూడా ఈ వీడియో చూసి, పడి పడి పడిపోండి.