‘ఎఫ్ 2’ టీజర్…మరో కామెడీ ఫుల్ మీల్స్ కి రెడీ కండి !

విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్రల‌లో న‌టిస్తున్న మూవీ ఎఫ్.2. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ స‌క్రాంత్రికి రిలీజ్ కానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. వెంకీ మరో సారి ముదురుపోయిన బ్రహ్మచారి పాత్రలో కనిపించాడు తనదైన శైలీలో నవ్విస్తే, వరుణ్ తేజ్ కూడా జతకలిశాడు. ఈ మూవీలో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కథానాయికలు. అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ సారి కామెడీనే ప్రధానంగా తీసుకుని ఆయన ‘ఎఫ్ 2’ సినిమాను చేశాడు. రేపు వెంకటేశ్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

f2-movie--venkatesh

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కామెడీ సీన్స్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. “ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాము. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు .. పెళ్లికి తరువాత” అంటూ వెంకీ చెప్పిన ఫన్నీ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతోంది. కంటెంట్ ఏమిటనేది చెప్పడానికి ఈ ఒక్క డైలాగ్ సరిపోతుంది. రఘుబాబు చెబుతున్నా వినిపించుకోకుండా వెంకీ పెళ్లి చేసుకుని కష్టాలు పడటం వెంకీ చెబుతున్నా వినిపించుకోకుండా వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుని తంటాలు పడటం చాలా ఫన్నీగా చూపించారు. మొత్తానికి హీరోల కామెడీ సీన్స్ తో ఎఫ్ 2 నవ్విస్తున్నది. ఈ టీజర్ ను మీరూ చూడండి.