వినయ విధేయ రామ నుండి లేటెస్ట్ అప్డేట్

Vinaya-Vidheya-Ram

రామ్ చరణ్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో భరత్ అను నేను ఫేం కీయరా అద్వాని కథానాయకి గా నటిస్తుంది. ఇటివల విడుదలైన ఫస్ట్ లుక్, మరియు టిజర్ కు ప్రేక్షకుల నుండి అంచి రెస్పాన్స్ వస్తుంది. ఇకా మెగా అభిమానులు మాత్రం ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ని ఓ సాంగ్ ను సోమవారం విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రోపొందించాడు.

వినయ విధేయ రామ నుండి లేటెస్ట్ అప్డేట్ - Telugu Bullet

కుటుంబ బంధాలు ఫ్యామిలీని ఎంత బలంగా నిలపెడుతాయి అని కథతో బోయపాటి ఈ చిత్రంలో చూపించనున్నాడు. అదే ఫ్యామిలీ అనుబందంతో ఓ సాంగ్ ను సోమవారం విడుదల చేస్తున్నారు. దానికి సంబందించిన అనౌన్సు మెంట్ ఈ రోజు చేస్తారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గురుంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైనా డ్రమ్స్ స్టైల్ తో ఆ సినిమాలోని పాటలను కూడా ఇరగదీశాడట. ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, ప్రశాంత్, స్నేహ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11 న ఈ సినిమా విడుదల కానుంది.