కొరటాలతో మహేష్ బాబు సినిమా… కథ అదేనా..?

Koratala Siva Next Will Be A Grand Project With Mahesh Babu

కొరటాల శివ “భరత్ అను నేను” చిత్రం తరువాత మరే సినిమాను మొదలు పెట్టలేదు. ప్రస్తుతం చిరంజీవి కోసం ఎదురు చూస్తున్నాడు. చిరు మాత్రం సురేందర్ రెడ్డి తో సైరా నరసింహా రెడ్డి చిత్రం చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా 2020 సంక్రాంతి విడుదల అవ్వుతుందట. కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని అన్నయ్య కోసం ఎదురుచూస్తున్నాడు. చిరు ఆలస్యం చేస్తున్న నేపద్యంలో కొరటాల శివ అప్ సెట్ అయ్యాడట. అప్పటి వరకు చిరంజీవి కోసం ఎదురు చూడలేడు, కావునా మహేష్ బాబుతో మరో సినిమా చేస్తాడని వార్తలు వస్తునాయి.ఇంతకు ముందు మహేష్ తో శ్రీమంతుడు, భరత్ అను నేను సినిమాలు తీసి మంచి విజయాలను అందించాడు.

koratala-siva-mahesh

ప్రస్తుతం మహేష్ మాత్రం మహర్షి చిత్రం తో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం తరువాత సుకుమార్ తో ఓ సినిమా ఉన్నది. డైరక్టర్ సుకుమార్ కూడా మహేష్ కోసం ఎదురు చూస్తున్నాడు. సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నాడు మరో రెండు నెలలో మహర్షి చిత్రం పుర్తి అవుతుంది. ఈలోగా సుకుమార్ కథ పూర్తి అయి మహేష్ ఓకే అంటే మాత్రం, కొరటాల శివ మరి కొద్ది రాజులు అగలిసిందే. లేకపోతె మహేష్, సుకుమార్ కి నో అని చెప్పిన పక్షంలో కొరటాలతో మహేష్ సినిమా మొదలవుతుంది. మరి చిరంజీవి కి చెప్పిన స్టొరీ ని, మహేష్ కి వినిపిస్తాడా లేకపోతే కొత్త కథ ఏదైనా సిద్దం చేస్తాడా అనేది చూడాలి.

mahesh-babu