ఈ సినిమాలో కూడా బోయపాటి మార్క్ చూపనున్నాడు

మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రుపొందుతున్న చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రంలో రామ్ చరణ్, కియర అద్వాని హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పుర్తి అయ్యింది. ఈ చిత్రం నుండి ఇటివల విడుదలైన టిజర్ మరియు ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నుండి ఓ లేటెస్ట్ అప్డేట్ చిత్ర బృంధం ద్వారా తెలుస్తుంది. బోయపాటి శ్రీను కి మాస్ నాడి బాగా తెలుసు. తన మొదటి సినిమా రవితేజ తో తీసిన భద్ర సినిమాకూడా ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫైట్ సిన్స్ కూడా అందరిని ఆకట్టుకుంటాయి. ఆ తరువాత వెంకటేష్ తో తులసి సినిమాలో కూడా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సిన్స్ లో వెంకటేష్ బోయపాటి తన యాక్షన్ పవర్ ఏంటో చూపించాడు. అలా వచ్చినా బోయపాటి సినిమాలో ఇంటర్వెల్ కు ముందు ఫైట్ సిన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి..

ఇప్పుడు రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చిత్రంలో కూడా ఇంటర్వెల్ ఫైట్ బోయపాటి ప్రత్యేక శ్రద్ద పెట్టి మరి ఫైట్ సిన్స్ ను తెరకెక్కించాడు. మొత్తం ఈ యాక్షన్ సిన్స్ లో 500 జునియర్ ఆర్టిస్ట్ అండ్ 100 మెంబెర్స్ ఫైటర్స్ తో ఇంటర్వెల్ ఫైట్ ను రూపొందించారు అని చిత్ర బృందం ద్వారా తెలుస్తుంది. ఈ చిత్రం లో ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాని వచ్చే ఏడాది జనవరికి సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.