బాలయ్య పై నాగబాబు షాకింగ్ కామెంట్స్

Naga Babu Ultimate Reply To Balakrishna On 6th Comment

మెగా బ్రదర్ నాగబాబు ఈ మద్య నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాక్యాలు చేశాడు. నాగబాబు సినిమాలో తనకు తగిన పాత్రలు చేస్తూ మంచి నటనను కనబరుస్తున్నాడు. ఆ మద్య ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ కి తండ్రి గా నటించి ఇటు నందమూరి ఫాన్స్ ను, మరియు మెగా అభిమానుల మనసును గెలుసుకున్నాడు. బుల్లితెర మెగా స్టార్ గా పిలవబడే నాగబాబు జబర్దస్త్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తూ…అప్పుడు అప్పుడు సీరియల్ లో నటిస్తూ మెగా స్టార్ చిరంజీవికి తగిన తమ్ముడు అనిపించుకుంటాడు.

నాగబాబు తన ప్రతి ఇంటర్వ్యూ లో కూడా ఆసక్తిగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఆ మద్య రామ్ గోపాల్ వర్మ తో సోషల్ సోషల్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. అది మరువకముందే రీసెంట్ గా నాగబాబు ను బాలయ్య గురించి మీ వ్యూ ఏంటి అని ఓ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు నాకు బాలకృష్ణ ఎవరో తెలియదన్నాడు. ఆ ఇంటర్వ్యూయర్ బాలయ్య ఎవరో చెప్పబోతుండగా … సినియర్ నటుడు బాలయ్య అయితే నాకు తెలుసు అని చెప్పేశాడు. మరో ప్రశ్నగా రాంగోపాల్ వర్మ గురుంచి అడిగిన ప్రశ్నకు అసలు అతను చేసే పనులకు అతని పేరు పలకడం కూడా నాకు ఇష్టంలేదన్నాడు.