ఎన్‌టి‌ఆర్ నుండి మరోటి వచ్చింది

NTR Biopic Second Song Release

నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో తెరక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఈ చిత్రం నుండి ఇటివల విడుదలైన కథానాయక అంటూ వచ్చే సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ చిత్రం నుండి రెండోవ సాంగ్ ఈ రోజు సాయంత్రం 4.30 విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ నుండి రోజుకు ఒక్క న్యూస్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ విడుదల చేస్తూ సినిమా పైన హైప్ తీసుకువస్తున్నాడు దర్శకుడు క్రిష్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తికావచింది. ఎన్టీఆర్ బయోపిక్ ను క్రిష్ రెండు భాగాలగా విడుదల చేస్తున్నారు మొదటి భాగం కథానాయకుడు పేరుతో జనవరి 11 న సంక్రాంతి కి విడుధలచేస్తున్నాడు.

Savitri First Look At NTR Biopic

కథానాయకుడి లో దివంగత నేత నందమూరి తారక రామారావు గారి జీవితానికి సంబందించిన బాల్యం, చదువు, పెళ్లి సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది అన్ని చుపించానున్నాడు. క్రిష్ మొదటి భాగంనకు సంబందించి, టాలీవుడ్ నుండి పెద్ద, పెద్ద స్టార్స్ నటిస్తున్నారు, రానా చంద్రబాబు నాయుడు పాత్రలోనూ , సుమంత్-అక్కినేని నాగేశ్వరావు, కళ్యాణ్ రామ్-హరికృష్ణ, రాకుల్-శ్రీదేవి గా ఇంకా ప్రముఖులు అలనాటి తారల పాత్రలో నటించారు. ఇంకా రెండోవ భాగం మహాయనకుడు పేరు తో జనవరి 24 న విడుదల చేస్తున్నారు. రాజకీయరంగ ప్రవేశం గురుంచి మహానాయకుడి పార్ట్ 2 లో చూపిస్తారు. ఈ చిత్రాని బాలకృష్ణ యన్బికే ప్రొడక్షన్స్ పైన నిర్మిస్తున్నాడు. సాయి కొర్రపాటి, విష్ణు సహానిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల చివరిలో తిరుపతిలో గ్రాండ్ గా చెయ్యనున్నారు. మఖ్యఅతిధిగా చంద్రబాబు హాజరు కాబోతున్నారు.