ఒక్క రాత్రికి కోటి ఇచ్చే నిర్మాతలు ఎవరు లేరు

kushboo talks about producer for moo to

సినీనటి ఖుష్బు తెలుగు,తమిళం, మలయాళం,కన్నడ, హింది, బాషలో మంచి పేరును సంపాదించుకుంది. ఖుష్బు 8 ఏండ్ల వయసులో సినిమా రంగ ప్రవేశం చేసారు. మొదట కాస్త బిడియంతోనే ఉండేవారట, సినిమాలో రాను రాను బిడియం కాస్త పోయి మంచి తెగింపు, ఉన్నది ఉన్నట్లే మాట్లాడటం అలవాటు చేసుకుంది. ఖుష్బు ఏ విషయాన్నీ అయినా కుండ బద్దలు కోటినట్లుగా మాట్లాడుతుంది. తాజాగా ఆమె సినిమా పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ గురుంచి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ నిర్మాత అయినా సరే సినిమా తియ్యలన్నా ఉద్దేశంతోనే సినిమా ఫీల్డ్ లోకి వస్తాడు. కొంతమంది మాత్రం సినిమా పేరుతో ఆడవారిని హింసిస్తారు. అలాంటి పనులకు సినిమా ప్రొడ్యూసర్ అనే మాస్క్ ధరించడం ఎందుకు అని కుష్బు మండిపడ్డారు.

సినిమా రంగంలోకి వచ్చినప్పటి నుండి నాకు మాత్రం ఏలాంటి కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ ఒకనోక్క సినిమా షూటింగ్ సమయంలో అంటే వెంకటేష్ తో కలియుగ పాండవులు సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో హాస్పిటల్ మెట్లమీదనుండి వస్తుంటే ఒక్కడు నన్ను రాంగ్ గా టచ్ చేశాడు. అప్పుడు నేను ఆ సమయంలో అతని చెంప పగలగోట్టాను. ఆ తరువాత అతను వాళ్ల ఉరి వాళ్ళను పిలుచుకొని వచ్చాడు ఆ సమయంలో వెంకటేష్, రామానాయుడు నాకు అండగా నిలబడ్డారు అని గుర్తుచేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఖుష్బు తాజాగా తెలంగాణలో ప్రచారం కూడా చేసిన విషయం తెలిసిందే.