మోడీకి షాక్…బాబు నేషనల్ కూటమిలోకి మరో పార్టీ !

Chandrababu Naidu Warns Prime Minister Narendra Modi

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి నేడు వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు సమావేశం కానున్న సంగతి తెలసిందే. మధ్యాహ్నం 3.30గంటలకు భాజపాయేతర పక్షాల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. సమావేశానికి సుమారు 14 పార్టీల నేతలు హాజరుకానున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణను నేతలు ఖరారు చేయనున్నారు. ఈ సమయంలో బీజీపీకి షాక్ తగిలింది. బీజేపీ నేతృత్వంలోనే నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ నుంచి మరో పార్టీ వైదొలిగింది. బీహార్ కు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు.. ఆ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా ప్రకటించారు. ఆయన ప్రస్తుతం కేంద్రమంత్రిగా కూడా ఉన్నారు. ఆయన తన పదవికి కూడా రాజీనామా చేసి కేబినెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీహార్ కు ఏమీ చేయలేదని అందుకే పదవికి వదులుకుని ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు కుష్వాహా ప్రకటించారు. ఆర్ఎల్ఎస్పీ ఆర్జేడీతో చేతులు కలిపి బీజేపీయేతర కూటమిలో చేరాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీయేతర కూటమి సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ పరిణామం జరగడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయింది. మోడీ బీహార్ కు ఏమీ చేయకపోవడం వల్లే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు కుష్వాహా ప్రకటించినా అసలు కారణం మాత్రం లోక్ సభ సీట్ల పంపణీలో ఏర్పడిన అసంతృప్తే.

modi shock chandrababu add new party in mahakutami

గత లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో బీజేపీ, రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి, కుష్వాహాకు చెందిన ఆర్ఎల్ఎస్పీ పార్టీలు కలిస పోటీ చేసి ఘన విజయం సాధించాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న ఆర్ఎల్ఎస్పీకి మూడు స్థానాలు ఇవ్వగా, మూడింటా విజయం సాధించిన తమ పార్టీకి వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో 7 సీట్లు కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో లాలూ ప్రసాద్ కు చెందిన ఆర్జేడీ, నితీష్ కుమార్ జేడీయూ విడివిడిగా పోటీ చేశాయి. దాంతో బీజేపీ పని సులువయింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కలసి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీ లాలూను జైలుకు పంపి నితీష్ కుమార్ తో లాలూచీ పడి ఆర్జేడీని ప్రభుత్వం నుంచి గెంటేసింది దాంతో సమీకరణాలు మారిపోయాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు జేడీయూ, బీజేపీ, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీలు బీహార్ లో ఉన్న 40 సీట్లను పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఉన్న సీట్లలో చెరో పదిహేడు స్థానాల్లో పోటీ చేయాలని జేడీయూ, బీజేపీ నిర్ణయించుకున్నారు. ఆరు స్థానాలు మిత్రపక్షాలకు ఇవ్వాలనుకున్నాయి. ఇందులో ఒక్కటి మాత్రమే కుష్వాహాకు ఇస్తామని ప్రతిపాదించారు. కానీ ఇప్పుడే ముగ్గురు ఎంపీలు ఉన్న కుష్వాహా ఒక్క సీటుకు అంగీకరించలేదు. అందుకే బీజేపీయేతర కూటమిలో చేరారు. వాస్తవానికి సీట్ల సర్దుబాటుపై అసంతృప్తితో నితీష్ కుమారే బీజేపీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఎలాగోలా సెటిల్ చేసుకున్నారు కానీ కుష్వాహాను సంతృప్తి పరచలేకపోయారు.