గ్యాప్ లో బన్నీ ఆ రీమేక్ చేయనున్నాడా?

allu arjun

అరవింద సమేత విజయం తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమా అల్లు ఆర్జున్ తో రూపొందించ బోతున్నాడు. దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. పూర్తి స్క్రిప్ట్ వర్క్ అండ్ లొకేషన్స్ కి కాస్త సమయం పట్టేలా ఉన్నది. ఈ లోపు తమిళ రీమేక్ మూవీ 96 నీ తెరకేక్కించాలి అని బన్నీ భావిస్తున్నాడు. దీనికి సంబందించిన సంప్రదింపులు చేస్తున్నాడు. ఇప్పటి వరకు రొటీన్ సినిమాలు చేస్తూ వచ్చినా బన్నీ 96 మూవీ తన సినీ కేరీర్ లో వైవిధ్యభరితమైన సినిమ అవ్వుతుంది అని బన్నీ గట్టి నమ్మకంతో ఉన్నాడు.

తమిళ 96 మూవీ రీమేక్ హక్కులను దక్కించుకున్నా దిల్ రాజ్ కూడా బన్నీ నే ఈ చిత్రం కు కరెక్ట్ అన్న నిర్ణయానికి వచేసినట్టుంది. ఎందుకంటే బన్నీ ఏదైనా సినిమా కు కమిట్ అయితే 100 పెర్సెంట్ ఎఫ్ఫెర్ట్ పెడుతాడు. తమిళ రీమేక్ లో త్రిష నటించిన పాత్రకు సమంత ని తీసుకోవాలని బన్నీ దిల్ రాజు లు భావిస్తునరంట. కానీ, తమిళ 96 మూవీ రీమేక్ హక్కులను తెలుగు వెర్షన్ లో ఆ చిత్ర డైరెక్టర్ ప్రేమ కుమార్ కే దిల్ రాజ్ అప్పచెప్పడంతో సమంత కాకుండా తమిళం లో నటించిన త్రిషనే తీసుకోవాలని సూచించాడు. దీంతో బన్నీ, దిల్ రాజ్ లు ఆలోచనలో పడ్డారు. ఈ ఇద్దరి లో ఎవరు ఫైనల్ అవుతారు అనేది వేచి చూడాలి.