‘విజేత’ సెన్సార్‌ రిపోర్ట్‌

vijetha movie censor report

మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. కళ్యాణ్‌ సినిమాల కోసం దాదాపు సంవత్సరం పాటు శిక్షణ తీసుకున్నాడు. డాన్స్‌ మరియు నటనలో ప్రావిణ్యం పొందాడు. ఈ చిత్రంలో ది బెస్ట్‌ నటనను కళ్యాణ్‌ ఇచ్చాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక కళ్యాణ్‌ మొదటి చిత్రం విజేత విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 12న కళ్యాణ్‌ విడుదల కాబోతున్న నేపథ్యంలో సెన్సార్‌ ముందుకు వెళ్లింది. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘విజేత’కు సెన్సార్‌ బోర్డు నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

తండ్రి, కొడుల మద్య సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘విజేత’ చిత్రంలో మంచి సందేశాన్ని ఇచ్చారని, ఈ చిత్రం తప్పకుండా యూత్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సంబంధించినంత వరకు కళ్యాణ్‌ నటన బాగుందని, అయితే కాస్త డైలాగ్‌ డెలవరీ మరియు ఎమోషన్‌ సీన్స్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ సెన్సార్‌ బోర్డు సభ్యుల నుండి అనధికారికంగా సలహా అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు భారీ ఎత్తున పబ్లిసిటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే ఆడియో వేడుక భారీగా నిర్వహించారు. తాజాగా సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. రాకేష్‌ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా మాళవిక నాయర్‌ నటించింది.