విద్యార్థులకు OnePlus బంపర్ ఆఫర్

OnePlus bumper offer for students

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం OnePlus భారతదేశంలో విద్యార్ధుల కోసం “స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్” అనే సరికొత్త ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా దేశవ్యాప్తంగా క్యాంపస్ నుండి ఎంపిక చేసిన అభ్యర్థులకు 6 నెలల ఇంటర్న్-షిప్ తో పాటు కంపెనీ స్టయిఫండ్ ను ఇస్తుంది.ఈ ప్రోగ్రాంలో OnePlus సంస్థ ఎంపిక అయిన అభ్యర్థులకు లేటెస్ట్ మరియు రిలీజ్ అవ్వని ఫోన్స్ యొక్క యాక్సిస్ను ( access) ఇస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఇండియా లో ఉన్న కాలేజీల్లో విద్యార్థులను ఎంపిక చేసుకొని రిక్రూట్ చేసుకుంటారు. ఎంపిక అయిన విద్యార్థులకు లేటెస్ట్ మరియు రిలీజ్ అవ్వని ఫోన్స్ యొక్క యాక్సిస్ ని కంపెనీ ఇస్తుంది. ఈ ప్రోగ్రాం లో విద్యార్థులు 6నెలల పాటు ఇంటర్న్-షిప్ చేయాల్సి వస్తుంది.

ఈ 6నెలలకు గాను OnePlus సంస్థ స్టయిఫండ్ ను ఇస్తుంది. ఇలా ఇంటర్న్-షిప్ చేయడం విద్యార్థులు కంపెనీ యొక్క విలువలు మరియు వర్క్ కల్చర్ ను తెలుసుకోగలుతారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులు ప్రొఫెషనల్ ఎక్సపీరియెన్స్ ను పొందవచ్చు. రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లో లభిస్తూ ఉంటుంది ఇలా ఇంటర్న్-షిప్ చేయడం వలన రాబోయే కొత్త స్మార్ట్ ఫోన్ల యొక్క డిజైనింగ్,ఫ్యాబ్రికేటింగ్,కాన్సెప్టుయులైజింగ్ ను తెలుసుకోవచ్చు. అలాగే మార్కెటింగ్ విలువలను పెంచుకోవచ్చు. సెప్టెంబర్ 1,2018 నుంచి ఈ ప్రోగ్రాం మొదలవబోతుంది అని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకైతే ఎలాంటి రిక్రూట్మెంట్ జరగలేదు. ఫోన్స్ మరియు టెక్నాలజీ ఫై ఆసక్తి ఉన్నవారిని మరియు కొత్త అవకాశం కోసం ఎదురు చూసే వారిని కంపెనీ రిక్రూట్ చేసుకుంటుంది. One Plus స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్లో పాల్గొనడానికి, మీరు One Plus Campus ను విజిట్ చేయవచ్చు లేకపోతే campus@oneplus.com మెయిల్ చేయవచ్చు.