వేడి వేడి టీ కొట్టు…కంటి సమస్యలు దూరంగా పెట్టు !

hot tea good for eyes

ఉదయం లేవగానే కప్పు టీ పడితే కానీ చాలా మంది బెడ్ దిగరు. కొందరైతే రోజంతా ఏమీ తినకుండా అయినా ఉంటారేమో కానీ నాలుగుసార్లు టీ తాగకుండా మాత్రం ఉండలేరు. అలాంటి వాళ్లకి పరిశోధకులు తియ్యటి టీ లాంటి వార్త చెప్పారు. అదేంటంటే రోజుకి ఒకసారి వేడి వేడిగా టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట. తాజాగా పలువురు నిపుణులు చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పెద్దలు, పిల్లలు కలిపి దాదాపు 10000 మందిపై పరిశోధకులు పరిశోధనలు జరిపారు. వయసు పెరిగే కొద్ది వచ్చే కంటి సమస్యలు వేడి వేడి టీ తాగీ వారి విషయంలో కాస్త తక్కువ ఉంటాయి అంటున్నారు నిపుణులు. ప్రతిరోజు ఒక కప్పు వేడి టీ తీసుకునేవారిలో కంటి సంబంధిత వ్యాధులు రావడం లేదని తేలింది. అయితే.. కచ్చితంగా టీ తాగితే.. కంటి చూపు కి సంబంధించిన సమస్యలు రావు అని చెప్పడం లేదు. కాకపోతే.. వచ్చే ఆస్కారం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. టీ లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, న్యూరో ప్రొటక్టివ్ కెమికల్స్ ఉంటాయి. వాటి వల్ల కంటి సంబంధిత వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్ లాంటివి రాకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు.