ఇలా చేస్తే సైనస్‌ నుంచి రిలీఫ్ పొందచ్చట !

way-to-avoid-sinus

తలనొప్పి తీవ్రంగా ఉందా ? కళ్ల దగ్గర దురదగా ఉందా? ముక్కు ఇరువైపులా ముట్టుకుంటే నొప్పిగా ఉందా? అయితే మీరు సైనసైటిస్‌తో బాధపడుతున్నట్టే. ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంల్లోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోవడాన్ని సైనసైటిస్ (Sinusitis) అంటారు. సైనసైటిస్‌ సమస్య ఉన్న వారి బాధ వర్ణణాతీతం. అది భరించే వారికి తప్ప మరెవరికీ అర్ధం కాదు. ఎన్ని మందులు వాడినా ఫలితం తాత్కాలికమే తప్ప తప్ప శాశ్వత ఉపశమనాన్ని చూపే చికిత్సలే లేవు. సైనస్ కారణంగా ముక్కు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఈ సమస్య కారణంగా ఏ పనిపై ఏకాగ్రత కుదరదు. దీంతో ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఎన్నో రకాల మందులు, వైద్య విధానాల్ని ఆశ్రయిస్తుంటారు. కానీ సైనస్ నుంచి ఉపశమనం కోసం ఓ వ్యక్తి మాత్రం ఎవరూ ఊహించని పని చేశాడు. దీంతో ఇప్పుడు సైనస్ నుండి రిలీఫ్ పొందేందుకు ఈ పద్ధతి ఇప్పుడు వార్తలలోకి ఎక్కింది.

అరిజోనాకు చెందిన స్కైలర్ ను సైనస్ చాలా ఇబ్బంది పెట్టేది. ముక్కు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమయ్యేది. దీంతో రాత్రి వేళల్లో నిద్ర పట్టేది కాదు. దీంతో హస్తప్రయోగాన్ని ఆశ్రయించి ఉపశమనం పొందాడట. ఈ విషయాన్నే డాక్టర్లకు చెబితే.. అవును అలా చేయడం వల్ల సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. భావప్రాప్తికి లోనైనప్పుడు ముక్కు సహా శరీరంలోని కండరాలు తాత్కాలికంగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా సైనస్ ఒత్తిడి తగ్గుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, నిద్రలేమి, ఒత్తిడి, నొప్పిని తగ్గించడానికి భావప్రాప్తి ఉపకరిస్తుందట. ఆడ, మగ అనే తేడా లేకుండా ఇది వర్తిస్తుందని డాకర్లు చెబుతున్నారు. స్కైలర్ క్రోనిక్ సైనస్ ఇన్ఫెక్షన్ తో బాధపడేవాడు. అది నొప్పిని కలిగించదు కానీ.. ముక్కు రంధ్రాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. రాత్రి సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి నిద్రపోగల్గుతున్నాడట.