‘విజేత’ టీజర్‌ రివ్యూ

Kalyaan Dhev Vijetha Teaser Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ‘విజేత’ చిత్రంతో కళ్యాణ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే కళ్యాణ్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ అయిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘విజేత’ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంలో కళ్యాణ్‌ ఒక ఆవారా కుర్రాడిగా కనిపించబోతున్నట్లుగా టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. తండ్రి ఉద్యోగం చేస్తూ ఉంటే, లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తూ గడిపే కుర్రాడు, అనుకోని పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతను నెత్తికి ఎత్తుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో కళ్యాణ్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఎలా తన కెరీర్‌ను ప్లాన్‌ చేసుకున్నాడు అనే విషయాలను దర్శకుడు చిత్రంలో చూపించబోతున్నాడు. చిన్న టీజర్‌లోనే సినిమా మొత్తంను చూపించేసిన దర్శకుడు సినిమాపై అంచనాలను పెంచేశాడు.

కళ్యాణ్‌ లుక్‌తో పాటు, ఆయన బాడీలాంగ్వేజ్‌ మరియు డైలాగ్‌ డెలవరీ టీజర్‌లో మాత్రం అంతగా అనిపించడం లేదు. పూర్తి సినిమాలో ఎలా ఉంటుందో తెలియదు కాని, టీజర్‌ విషయంలో ఆయన ఆకట్టుకోలేక పోతున్నాడు. ఒక సామాన్యమైన కుర్రాడిగా కళ్యాణ్‌ దేవ్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఇలాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. కాని కాస్త కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం తెరకెక్కిందని టీజర్‌ మరియు ఫస్ట్‌లుక్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ మెగా హీరోకు మొదటి సినిమాతో ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది సినిమాను చూస్తే కాని తెలియదు. జులై నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కళ్యాణ్‌కు జోడీగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో పాటు, క్యూట్‌ లవ్‌ స్టోరీ కూడా ఈ చిత్రంలో ఉంటుందని తెలుస్తోంది.