ఇండియన్‌ యూట్యూబ్‌ సూపర్‌ స్టార్‌ అల్లు అర్జున్‌

Allu Arjun Sarainodu Movie Becomes Most Watched Indian Film On Youtube

అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా కేథరిన్‌ తెర్సా ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రం బన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు సాధించిన విషయం తెల్సిందే. బోయపాటి తనదైన శైలిలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లారు. థియేట్రికల్‌ రైట్స్‌ కాకుండా కేవలం డబ్బింగ్‌ శాటిలైట్‌ రైట్స్‌ను మాత్రమే విక్రయించడం జరిగింది. ప్రముఖ హిందీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో ‘దిల్‌వాల’ పేరుతో ఈ చిత్రం చాలా సార్లు ప్రసారం అయ్యింది. ప్రసారం అయిన ప్రతి సారి కూడా మంచి టీఆర్పీరేటింగ్‌ను దక్కించుకుంది. ఇక ఈ చిత్రం యూట్యూబ్‌లో కూడా రికార్డును సృష్టించింది.

ఇప్పటి వరకు ఏ బాలీవుడ్‌ చిత్రం కాని, ఏ సౌత్‌ చిత్రం కాని, ఏ ఇండియన్‌ సినిమా కాని యూట్యూబ్‌లో సాధించని రికార్డును అల్లు అర్జున్‌ ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్‌ చిత్రం ‘దిల్‌వాల’ దక్కించుకుంది. ఏకంగా 200 మిలియన్‌ వ్యూస్‌ను రాబట్టి సంచలనం సృష్టించింది. అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, అమితాబచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌ ఇలా ఏ ఒక్కరి మూవీలు కూడా యూట్యూబ్‌లో ఈ స్థాయి వ్యూస్‌ను దక్కించుకోలేక పోయాయి. ఈస్థాయి కాదు, ‘దిల్‌వాల’ వ్యూస్‌ దరిదాపుల్లో కూడా బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రాలు రాలేక పోయాయి. ఇంత భారీ వ్యూస్‌కు కారణం ఏంటా అని ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అల్లు అర్జున్‌ ‘సరైనోడు’ చిత్రమే కాకుండా, డీజే మరియు సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు కూడా భారీగా యూట్యూబ్‌లో వ్యూస్‌ను రాబడుతున్నాయి. అందుకే ఇండియన్‌ యూట్యూబ్‌ సూపర్‌ స్టార్‌ అంటూ అల్లు అర్జున్‌ను పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురితం చేస్తున్నాయి. అల్లు అర్జున్‌ ఇదే జోరుతో బాలీవుడ్‌లో సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.