ఎటూ తేల్చుకోలేక పోతున్న బన్నీ

allu arjun Confuision with next movie director

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వరుస విజయాల తర్వాత అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోని కథతో దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కించాడు. అల్లు అర్జున్‌ ఆ సినిమాను కమర్షియల్‌ యాంగిల్‌లో చూడకుండా ఒక ప్రయోగాత్మక చిత్రంగా చేయడం జరిగింది. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ప్రస్తుతం బన్నీ తన రూటు మార్చాడు. డీజే వంటి సూపర్‌ కమర్షియల్‌ సక్సెస్‌ను ఇచ్చిన దర్శకుడు హరీష్‌ శంకర్‌తో ఒక సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌ తమిళ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరున్న విక్రమ్‌ కుమార్‌ తనదైన శైలితో సినిమాలను తెరకెక్కిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. అయితే ఈయన ప్రయోగాలు కొన్ని సార్లు విఫలం అయ్యాయి. అందుకే అల్లు అర్జున్‌ కాస్త టెన్షన్‌ పడుతున్నట్లుగా తెలుస్తోంది. విక్రమ్‌ కుమార్‌తో సినిమా చేస్తే సక్సెస్‌ గ్యారెంటీ లేదు. కాని హరీష్‌ శంకర్‌తో చేస్తే కమర్షియల్‌ సక్సెస్‌ ఖాయం అంటూ బన్నీ భావిస్తున్నాడు. అందుకే వీరిద్దరిలో హరీష్‌ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు. అయితే కొందరు బన్నీ శ్రేయోభిలాషులు మాత్రం విక్రమ్‌ కుమార్‌ వంటి దర్శకుడి దర్శకత్వంలో నటించడం మంచిదని, తప్పకుండా ఆ సినిమా బన్నీ కెరీర్‌లో నిలిచి పోతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో బన్నీ ఎటూ తేల్చుకోలేక ఇబ్బందుల్లో పడ్డాడు.