బన్నికి లైన్ వేస్తున్న మారుతి

స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం పరాజయం తరువాత మరో చిత్రాని చెయ్యడానికి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రం విజయం తరువాత మంచి ఫాంలో ఉన్నా త్రివిక్రమ్ బన్నీ సినిమా కు సంబందించిన స్క్రిప్ట్ పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం వచ్చేఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్నది. అదేవిధంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. మెగాఫ్యామిలీ కి అత్యంత సన్నిహితుడు, ముఖ్యంగా అల్లు ఫ్యామిలీకి దగ్గరవాడు అయిన డైరక్టర్ మారుతి అల్లు ఆర్జున్ తో ఓ సినిమాను తీయాలి అని ప్లాన్ చేస్తున్నాడు.

Allu Arjun

అల్లు శిరీష్ కి కొత్త జంట రూపంలో మంచి హిట్ట్ అందించినా మారుతి ఇప్పుడు అన్నకు మంచి హిట్ట్ ఇవ్వాలని మారుతి ఎదురుచూస్తున్నాడు. ఈ మద్య బన్నీ ని కలిసినా మారుతీ ఓ కథను వినిపించాడు. బన్నీకి కథలో ఫస్ట్ ఆఫ్ భాగానచ్చి, సెకండ్ అఫ్ లో కొన్ని మార్పులు చెయ్యవలిసిందిగా సూచించాడు. మారుతి కూడా బన్నీని ఎలాగైనా ఓపించాలి అని సెకండ్ అఫ్ లో మార్పులు చేస్తున్నాడు. శైలజ రెడ్డి అల్లుడు చిత్రంతో నిరాశపరిచినా బన్నీతో ఎలాగైనా హిట్ట్ కొట్టి మరల మునపటి ట్రాక్ రికార్డును అందుకోవాలి అని గట్టి పట్టుదలతో ఉన్నాడు.