తెలుగు దర్శకుల మీద నమ్మకం లేక…ఆయన దగ్గరకు వెళ్ళారా…?

Tamil Top Director To Team Up With Allu Arjun

మురుగ‌దాస్ ప్ర‌తిభ గురించి మనకి తెలిసిందే, ఇండియాలో టాప్ -10 ద‌ర్శ‌కుల జాబితాలో ఆయ‌న ఒక‌రు. డిఫ‌రెంట్ మేకింగ్ తో సినిమాలు చేయ‌డం మురుగ‌దాస్ స్పెషాలటీ. క‌త్తి త‌ర్వాత కొన్ని ప్లాప్ లు ఎదురైనా ఇటీవ‌ల స‌ర్కార్ తో మ‌ళ్లీ లైన్ లోకి వ‌చ్చేసారు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో సినిమా చేయ‌డానికి ఆయన రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా అనంత‌రం బ‌న్నీతో సినిమా చేసేలా అర‌వింద్ పావులు క‌దుపుతున్న‌ట్లు ఉప్పందింది. ప్రస్తుతం టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి త‌ప్ప ఇంకెవ్వ‌రికీ స‌రైన స‌క్సెస్ లేవు. అందుకే అర‌వింద్ తెలివిగా త‌న‌యుడు కోసం మురుగ‌దాస్ ని రంగంలోకి దించాల‌నుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

అలాగే చిన్న కోడుకు శిరీస్ కోసం మురుగ‌దాస్ రైటింగ్ టీమ్ నుంచే ఓ క‌థ కూడా తీసుకోవాల‌నుకుంటున్నాడట‌. శిరీష్ ప్రొఫెష‌నల్ కెరీర్ ప‌రంగా ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే ఉంది. ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. అందుకే తెలుగు రైట‌ర్ల‌ను న‌మ్ముకుంటే లాభం లేద‌ని ముర‌గ‌దాస్ టీమ్ నే రిక్వెస్ట్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు వినిపిస్తోంది. బ‌న్నీతో సినిమాకి – శిరీష్ కోసం క‌థ‌కు క‌లిపి మురుగ‌దాస్ కి 20 కోట్లు ఆఫ‌ర్ చేసే ఆలోచ‌న‌లో అర‌వింద్ ఉన్న‌ట్లు మెగా కాంపౌండ్ వ‌ర్గాల నుంచి అందుతున్న సమాచారం. మురుగ‌దాస్ తో అర‌వింద్ కు మంచి స్నేహం కూడా ఉంది. ఎందుకంటే అప్పట్లో గజని సినిమా నిర్మించారు. ఆ చనువతోనే ఆయనకు అర‌వింద్ చాన్స్ ఇచ్చాడని అంటున్నారు.