చరణ్ తర్వాత బన్నితో రొమాన్స్ కు సై అంటోంది…!

Allu Arjun Next Movie Heroine Kiara Advani

స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా పరాజయం తరువాత తన తదుపరి సినిమాను స్టార్ట్ చెయ్యడానికి దాదాపుగా వన్ ఇయర్ పైగా టైం పట్టింది. ఈ మద్యలో బన్నీ చాలా కథలు విన్నాడు. బన్నీ సినిమాలపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. మొదట విక్రం కె కుమార్ సినిమాలో నటిస్తున్నట్లు, ఆ తరువాత తమిళ 96 రీమేక్ మూవీలో చేస్తాడని మరో హాట్ టాపిక్ గా ఈ మద్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినా విషయం గీత గోవిందం దర్శకుడు పరుశురాం తో సినిమాను అంగికరించినట్లు ఇలా రకరకాలుగా అల్లు ఆర్జున్ పై వార్తలు వచ్చాయి. కానీ వాటికీ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ త్రివిక్రమ్ తో సినిమాను ఫైనల్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నది.

త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసి ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా త్రివిక్రమ్ తాజాగా బన్నీ సరసన బాలీవుడ్ నటి కైరా అద్వాని ఎంపిక చేశాడు. కైరా తెలుగులో భరత్ అనే నేను సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతుంది. బాలీవుడ్ సినిమాలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నది. విజయ్ దేవరకొండ నటించిన ఆర్జున్ రెడ్డి చిత్రం రీమేక్ కబీర్ సింగ్ సినిమాలో కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కైరా తెలుగు, హింది సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నది. తాజాగా త్రివిక్రమ్ సినిమాలో బన్నీ సరసన నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరగడంతో పాటుగా కైరా మంచి డాన్సర్ కావడంతో బన్నీ కి సరైన డాన్సర్ పాట్నర్ కైరా అవ్వుతుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. వచ్చే నెల ఫిబ్రవరి నుండి రెగ్యులర్ గా సినిమా స్టార్ట్ అవ్వుతుంది.