ఇన్ని రోజులు ఆలోచించి నో చెప్పిన బన్నీ…!

Allu Arjun Finally Rejects 96 Movie Remake

బన్నీ కెరీర్ ఇప్పుడు అంత బాగాలేదు అని చెప్పుకోవాలి వరసగా పరాజయాలు వెంటాడుతున్నాయి. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం పరాజయం పాలు అవ్వడంతో దాదాపు గా ఎనిమిది నెలలు సినిమాలకు దూరం గా ఉన్నాడు. అప్పటి నుండి కథలు వింటూ మంచి కథ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. బన్నీ మొదట విక్రం కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తాడు అని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా గా విక్రం కథను పక్కన పెటేశాడు. అరవింద సమేత సినిమా తో మంచి హిట్ట్ ను దక్కించుకున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఓకే చెప్పాడు. ఈ నేపద్యంలోనే తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష , జంటగా నటించిన చిత్రం 96 విడుదలై మంచి విజయంను దక్కించుకుంది. విమర్శకులు సైతం ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటివల బన్నీ స్పెషల్ గా ఓ షో వేసుకొని చూశాడు అంట సినిమా బాగా నచ్చడంతో ఈ చిత్రం రీమేక్ లో నటించాలి అని భావించాడు.

allu arjun

ఈ చిత్రం రీమేక్ హక్కులను తెలుగులో దిల్ రాజ్ దక్కించుకున్నాడు. దిల్ రాజ్ తో ఈ సినిమా రీమేక్ లో నటించాలని ఉన్నది అని కూడా చెప్పాడంట. మరల ఎందుకో ఈ సినిమా నా బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవ్వుతుందా, కాదా అని భాగాలోచించాడు అంట, ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఫలితం లేకుండా పోతుందేమో అని అలోచించి చివరికి నో అని చెప్పేశాడు. దిల్ రాజ్ కూడా మరో హీరోని వెతికే పనిలో ఉన్నాడు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ నే తెలుగు 96 రీమేక్ లో తీసుకున్నాడు దిల్ రాజ్ ప్రేమ్ కుమార్ ఆల్రెడీ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్నాడు. బన్నీ, మరే కథలు వినకుండా త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ మాత్రం పూర్తి స్క్రిప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నాడు. జనవరి నుండి బన్నీ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వుతుంది అని సినివర్గాల అభిప్రాయం