టైటిల్ తో ఆసక్తి రేకెత్తించిన కళ్యాణ్ రామ్…!

Nandamuri Kalyan Ram New Movie Title Is 118

కెవి గుహన్ తెలుగులో కళ్యాణ్ రామ్ తో ఒక సినిమాను రూపొందించాడు. ఇటివల ఈ చిత్రంకు సంబందించిన టైటిల్, మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 118 అనే టైటిల్ ఖరారు చెయ్యడంతో సినిమాపైనా మరింత ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయ్యాడు గుహన్. హీరో కళ్యాణ్ రామ్ 118లో చివరి ఎనిమిది అంకెలో చాలా స్టైలిష్ గా నిలుచున్నాడు. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ రావచ్చు. కెవి గుహన్ కు ఇది తెలుగులో ఫస్ట్ సినిమా, హ్యాపీ డేస్ సినిమాను తమిళంలో ఇనదు ఇనదు అనే పేరు తో రీమేక్ చేశాడు. దీనికి ప్రకాష్ రాజ్ నిర్మాత వ్యవహరించాడు. చిత్ర నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ 118 టైటిల్ పెట్టడం వెనక ఈ చిత్రంకు సంబందించిన ఓ వైవిధ్యమైన కథ ఉన్నదన్నారు.

kalyanram

ఈ చిత్రం గురించి ఇప్పటి వరకు ఏ అప్డేట్ కూడా ఇవ్వకుండా టైటిల్ ను ప్రకటించారు. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రంకు సంబందించిన టిజర్, మరియు ట్రైలర్ లను విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రంలో నివేత థామస్, శాలిని పాండే నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు అన్ని వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ సారికూడా మరో ప్రయోగంకు సిద్దం అయ్యాడు. mla, నా నువ్వే సినిమాలు నిరాశను మిగిలించాడంతో, 118 సినిమాతో ఎలాగైనా హిట్ట్ సాదించాలి అని గట్టి పట్టుదలతో ఉన్నాడు.

118-movier