స్పీడ్ గేర్ వేసిన కళ్యాణ్ రామ్ !

kalyan Ram Speeds Up His Movies

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా బాగానే రాణిస్తున్న‌, న‌టుడిగా మంచి హిట్స్ అందుకోలేక‌పోతున్నాడు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం 118. గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ హోప్సే పెట్టుకున్నాడు క‌ళ్యాణ్‌. ఇక త్వ‌ర‌లో మ‌రో రెండు చిత్రాల‌ని మొద‌లు పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఒకేసారి జ‌రుగుతుంద‌ట‌. ల‌క్ష్యం ఫేమ్ శ్రీవాస్‌తో క‌లిసి ఓ చిత్రం చేయ‌నున్న క‌ళ్యాణ్ రామ్ మ‌రో చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు వ‌శిష్ట డైరెక్ష‌న్‌ లో చేయ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ రెండు చిత్రాల‌ని ఒకే సారి సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇదిలా ఉంటే ఉయ్యాల జంపాల ఫేం విరించి వ‌ర్మ‌తోను క‌ళ్యాణ్ రామ్ ఓ సినిమా బాకీ ఉంది మరి దానిని ఎప్పుడు చేస్తారో త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.