హీరోయిన్ గా సాయి పల్లవి చెల్లి…ఆశ తీరదా ?

Sai Pallavi Sister Debut With Dhanush

సాయి ప‌ల్ల‌వి ఇమేజ్ గురించి మాట‌ల్లో చెప్ప‌డం సాధ్యం కాదు. నిజానికి అందాలు ఆర‌బోయ‌ద‌ని తెలిసినా కూడా సాయి ప‌ల్ల‌వితో సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతున్నారు ద‌ర్శ‌కులు. ఇక ఈమెకు ఓ చెల్లి కూడా ఉంది. ఆమె పేరు పూజా క‌న్న‌న్. అక్క మాదిరే పూజా కూడా డాక్ట‌ర్ కావాల‌నుకుంటుంది. ప్ర‌స్తుతం ఎంబిబిఎస్ చేస్తుంది ఈ భామ‌. పూజా కూడా అచ్చంగా చూడ్డానికి సాయి పల్ల‌వి మాదిరే అందంగా ఉంటుంది.

దాంతో ఇప్పుడు ఈమె కూడా సినిమాల్లోకి వ‌స్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దానికి తోడు హీరో ధ‌నుష్ తో ఈమె తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దాంతో త్వ‌ర‌లోనే పూజా హీరోయిన్ కానుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ వ‌చ్చింది. పూజా కేవ‌లం ధ‌నుష్ తో స‌ర‌దాగా తీసుకున్న సెల్ఫీ ఇద‌ని తాను సినిమాల్లోకి రాద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆమె దృష్టి మొత్తం డాక్ట‌ర్ చ‌దువుపైనే ఉంద‌ని.. వైద్యురాలిగా సెటిల్ అవ్వాల‌ని పూజా కోరుకుంటుంద‌ని తేల్చేసారు వాళ్లు. దాంతో సాయి ప‌ల్ల‌వి చెల్లి సినిమాల్లోకి వ‌స్తుంద‌నే వార్త‌లు ఇప్పుడు గాలి వార్త‌లుగానే మిగిలిపోయాయి.