కళ్యాణ్ రామ్ “డెవిల్ “నుండి కొత్త పాట ప్రోమో రేపు రిలీజ్!

కళ్యాణ్ రామ్
Kalyan Ram " Devil"

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ డెవిల్. ఈ సినిమా డిసెంబర్ 29, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ సినిమా రిలీజ్ డేట్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార సినిమా లు ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకున్నాయి.

కళ్యాణ్ రామ్ "డెవిల్ "నుండి కొత్త పాట ప్రోమో రేపు రిలీజ్!
Kalyan Ram

ఈ సినిమా నుండి మేకర్స్ రేపు దూరమే తీరమై సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా కి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నది .