గూడచారి భామకు చేదు అనుభవం !

Sobhita Dhulipala Faces Hard Situation

గూఢచారిలో నటించిన తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల గుర్తుండే ఉంటుంది కదా. తాజాగా ఆమెకు ఓకే హోటల్ లో చెడు అనుభవం ఎదురయ్యందట. ప్రస్తుతం ఆమె ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమెది ముస్లిం యువతి పాత్ర కావడంతో ఆమె షూట్ అయ్యాక ఓ హోటల్‌ కు వెళ్లారు. అయితే ఆమె పాత్ర కోసం వేసుకున్న బుర్ఖాను తొలగించకుండానే హోటల్‌ లోపలికి వెళ్లి తన పేరు శోబిత అని తన పేరిట తన వాళ్ళు రూం బుక్‌ చేశారని, తాళాలు ఇవ్వాలని రిసెప్షన్‌లో ఉన్న వ్యక్తిని అడిగారట. అయితే అతను ఆమెకు తాళం ఇవ్వలేదు సరికదా ఎదురు ఈమెతో అనుచితంగా ప్రవర్తించారట.

ఈ విషయాన్ని శోభిత ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. నేను నటినని అక్కడున్న రిసెప్షనిస్ట్‌కు తెలియదని ఆ సమయంలో నేను బుర్ఖాలో ఉన్నానని నా బ్యాగు కూడా దుమ్ము పట్టి ఉందని ఆమె చెప్పుకొచ్చింది. అతనిని తన గది స్పేర్ కీస్ అడిగితే ఇవ్వలేదని అతనితో గొడ‌వ‌ప‌డాల‌ని లేక‌పోవ‌డం వ‌ల‌న నేను ఏమ‌న‌కుండా అక్క‌డి నుండి వెళ్ళానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే అక్క‌డున్న వారు ఎవ‌రు కూడా సాయం చేయ‌లేదని ముస్లిం మహిళ అనుకొని ఆ వ్య‌క్తి నాతో ప్ర‌వ‌ర్తించిన తీరు నన్ను ఎంత‌గానో బాధించిందని, న‌టి అయిన నాకే ఇలాంటి పరిస్థితి వ‌స్తే మిగ‌తా వాళ్ళ ప‌రిస్థితి ఏంట‌ని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.