కళ్యాన్ రాం సినిమా బాగుందన్న మహేష్ !

Mahesh Babu Appreciates In 118 Movie

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా గుహన్ దర్శకత్వంలో రూపొందిన ‘118’ సినిమా ఈ నెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన సినిమాగా మంచి పేరు తెచ్చుకుంటోంది. ఈ మధ్య కాలంలో కల్యాణ్ రామ్ కి హిట్ ఇచ్చిన సినిమా ఇదే. ‘118’ చూసిన సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు కూడా స్పందించాడు. ఆకట్టుకునే కథ .. ఆసక్తిని రేకెత్తించే కథనంతో సాగే ఈ సినిమాను చూస్తూ తాను చాలా ఎంజాయ్ చేసినట్టుగా చెప్పాడు. సినిమాటోగ్రఫర్ గా దర్శకుడిగా గుహన్ అద్భుతమైన పనితీరును కనబరిచారంటూ ప్రశంసించారు. ఈ సినిమా ఈ స్థాయిలో తెరపై ఆవిష్కరించబడటానికి కారణమైన టీమ్ కి ఆయన అభినందనలు తెలియజేశాడు.