సస్పెన్స్ తో ‘118’ టీజర్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్ర‌స్తుతం త‌న‌ 16వ ప్రాజెక్ట్‌గా 118 చిత్రాన్ని కెవి గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలిని పాండే నటిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జనవరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ముందుగా చెప్పినట్టుగానే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా నటిస్తుండగా షాలిని పాండే ఆయన సతీమణి గా నటిస్తుంది. ముందు వాళ్లు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించడం .. ఆ తరువాత అనూహ్యమైన సంఘటనలను ఫేస్ చేయడం ఈ టీజర్ లో కనిపిస్తోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. మరో కథానాయిక అయిన నివేదా థామస్ రోల్ ను ఎక్కడా రివిల్ చేయకపోవడం విశేషం. టీజర్ అంతా కూడా సస్పెన్స్ ను మెయింటేన్ చేస్తూ కొనసాగింది. టైటిల్ కి తగినట్టుగానే విజువల్స్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా కల్యాణ్ రామ్ ను కొత్తగా చూపించనుందనే విషయం మాత్రం అర్థమవుతోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు కానుంది.