చాలా స్పెషల్ గా కనిపించబోతున్న శర్వా…!

Sharwanand Acting On Villain Role In Dalapathi Movie

హను రాఘవ పూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నా చిత్రం పడి పడి లేచే మనసు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్ కు మంచి రెస్పాన్సు వచ్చింది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నది. ఈ చిత్రం ఈ నెల 21 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ చిత్రం తరువాత తన తదుపరి చిత్రాని సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే సగం షూటింగ్ ను పూర్తి చేసుకున్నది. ఈ చిత్రంలో శర్వానంద్ డ్యూయల్ రోల్ పాత్రలో నటిస్తున్నాడు. అందులో ఒక్కటి మాఫియ డాన్ ను తలపించే పాత్రలో శర్వానంద్ కనిపిస్తాడు.

మరో పాత్రలో ఓ సాధారణ యువకుడిలా కనిపించనున్నాడు. దర్శకుడు సుధీర్ వర్మ తనదైనా స్టైల్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. మాఫియా డాన్ పాత్ర కోసం శర్వానంద్ లుక్ ను పూర్తిగా మార్చి వేశారంట. వయసుపై బడిన మాఫియాడాన్ గా శర్వ కనిపించాలని బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ ను పిలిపించారంట. ఈ చిత్రం కోసం దళపతి అనే టైటిల్ ను పరిశిలించారంట. రజినీకాంత్ సినిమా టైటిల్ తో వస్తే సినిమా పైన అంచనాలు పెరుగుతాయని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. కానీ ఆల్రెడీ ఓ నిర్మాత ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించి ఉంచాడు. అతను ఒప్పుకుంటే మాత్రం శర్వానంద్ సినిమాకు దళపతి అనే టైటిల్ ఫిక్స్ అయ్యినట్లే అంటున్నారు చిత్ర దర్శకుడు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.