చింతమనేని మారిపోయారా…?

Tdp-Mla-Chintamaneni-Prabha

చింతమనేని అంటే ఆయన దురుసు టక్కున ప్రవర్తనే కనిపిస్తుంది. అయితే గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు సూచనల దృష్ట్యా ఈ సారి ఆయన తన కోపాన్ని దిగమింగుకుని ఎవర్నీ దూషించకుండా వెళ్లిపోయారు. గుంటూరు వైపు నుంచి ఆయన విజయవాడ వెళ్తున్న సమయంలో మంగళగిరి మండలం కాజా టోల్‌ గేట్‌ వద్ద సిబ్బంది ఆపేశారు. ఎమ్మెల్యే పాస్ ఉందని చెప్పినా కారుకు నెంబర్ ప్లేట్ లేదన్న కారణంగా టోల్ గేట్ సిబ్బంది కారును కదలనివ్వలేదు. ఎంత సేపు చెప్పినా వినకపోవడంతో చింతమనేని కారు అక్కడే వదిలివేసి బస్సులో వెళ్లిపోయారు. మామూలుగా అయితే ఎవరు ఎదిరించినా చెప్పిన మాట వినకపోయినా చింతమనేని తీరు సెకనల్లో మారిపోతుంది. అయినా ఈ సారి మాత్రం ఆయన ఆ వివాదానికి చోటివ్వలేదు. నిజానికి చోట్ల గేట్ల వద్ద సిబ్బంది చూపించే అత్యుత్సాహానికి తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. రాజకీయ పార్టీల నేతలు అనుచరులతో కలసి వస్తున్న సమయంలో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం మీడియాలో చూస్తూనే ఉంటాం టోల్ సిబ్బంది ఎదురుతిరిగితే గేట్లను బద్దలు కొట్టేసి సిబ్బందిని తీవ్రగా చితకొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ చింతమనేనికి అలాంటి ట్రాక్ రికార్డ్ చాలా ఉన్నప్పటికీ మరో కొత్త వివాదం తెచ్చుకోవడం ఇష్టం లేక పెళ్లిపోయారు. ఈ విషయం కలకలం రేపుడంతో టోల్ గేట్ సిబ్బంది వివరణ ఇచ్చుకున్నారు. ఈ వివాదంలో తప్పంతా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దేనని వారు స్పష్టం చేశారు. చింతమనేని కారుకు ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్ లేకుండా రావడంతో తొలుత వాహనాన్ని అడ్డుకున్నామని తెలిపారు. చలి కారణంగా తలకు మఫ్లర్ చుట్టుకుని ఉండటంతో చింతమనేనిని గుర్తుపట్టలేకపోయామని వెల్లడించారు. చివరికి ఆయన మఫ్లర్ తీయగానే గేటు తీసి వెళ్లాల్సిందిగా కోరామని పేర్కొన్నారు. అయినా ఈ విషయాన్ని చింతమనేని వివాదం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమ తప్పు ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే చింతమనేని తన ఇద్దరు గన్ మెన్లతో కలిసి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తాను ఎమ్మెల్యేను అని చెప్పినా టోల్ సిబ్బంది వినిపించుకోలేదని చింతమనేని ఫిర్యాదులో తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు ప్లాజా సిబ్బందిపై కేసు నమోదుచేశారు. మరోవైపు చింతమనేని వదిలివెళ్లిన కారును ఎవరు తీసుకెళ్లాలన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. చింతమనేని పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కారును పోలీస్ అధికారులు తీసుకెళ్లాలా? లేక టోల్ ప్లాజా సిబ్బంది స్వాధీనంలో ఉంచాలా? అన్న విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.