పార్టీ వీడతా…చింతమనేని సంచలనం !

Chintamaneni Prabhakar Controversial Comments Dalits
వివాదాలంటే ముందుండే దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మరో వివాదంలో చిక్కుకున్నారు. దళితుల్ని అసభ్య పదజాలంతో దూషించారంటూ ఆయన మాట్లాడుతున్న్ యక వీడియో వైరల్ అవుతోంది. మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు అంటూ ఆయన మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చింతమనేనిపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏలూరు ఫైర్ స్టేసన్ సమీపంలో ధర్నాకు దిగారు. టీడీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబు చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. దళిత సంఘాలకు వైసీపీ నేతలు కూడా మద్దతు పలికారు. దీంతో వీరికి పోటీగా చింతమనేని కూడా ఏలూరులో అనుచరులతో కలిసి పోటీగా ధర్నాకు దిగారు. సోషల్‌ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇరు వర్గాలు పోటీగా ధర్నాలకు దిగడంతో భారీగా పోలీసుల్ని మోహరించారు.
అలాగే వైసీపీ సోషల్ మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని వీడియోను ఎడిట్ చేశారని చింతమనేని జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారని సమాచారం. అలాగే తెలుగుదేశం పార్టీకి తన వల్ల చెడ్డపేరు వస్తోందంటే పార్టీ నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.తాను దళిత పక్షపాతినని చెప్పుకొచ్చారు. దళిత పక్షపాతి అయిన తనను దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందంటే తాను పార్టీ వీడతానన్నారు. త్వరలో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. మరోవైపు దళితులంటే తనకు ఎంతో గౌరవం అని ఆయన అన్నారు.