మళ్ళీ రేచ్చిపోయిన శ్రీ రెడ్డి…ఈసారి కొరటాల !

Sri Reddy Comments On Koratala Siva

కొన్ని రోజులుగా శ్రీ రెడ్డి సైలెంట్ గా ఉండడం తో అంత హ్యాపీ గా ఉన్నారు..కానీ జనాలను హ్యాపీ గా ఉంచడం రెడ్డి కి నచ్చదు కదా..అందుకే మరోసారి సంచలనం రేపింది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి గతంలో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ చెందిన ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసింది. వారిలో టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివపై కూడా ఉన్నారు. తనకు ఛాన్సులు ఇస్తానని నమ్మించి మోసం చేశాడంటూ ఆయనపై ఆరోపణలు చేసింది. ఇక శ్రీరెడ్డి ఆరోపణల లిస్ట్‌లో చాలా మంది ప్రముఖులు ఉండటంతో అప్పట్లో వీటిపై పెద్ద దుమారం లేచింది.

అయితే ఇటీవల తమిళనాడు నుండి హైదరాబాద్‌కు వచ్చిన శ్రీరెడ్డి తిరిగి తన పాత పద్దతికి వచ్చేసింది. ఎప్పుడో మర్చిపోయిన కొరటాలను ఎందుకు గుర్తుచేసుకుందో తెలియదు కాని మరో ఆయనపై సంచలన కామెంట్స్ చేసింది. ‘ప్రపంచంలోనే నెం.1 వరస్ట్ క్యారెక్టర్ కొరటాల శివ. ఒకవేళ నా బయోపిక్ అంటూ తీస్తే అందులో మేజర్ పార్ట్ కొరటాల శివదే ఉంటుందని’ బాంబ్ పేల్చింది శ్రీరెడ్డి. అక్కడి తో ఆగకుండా ఓ నీచమైన ఫోటో ను పోస్ట్ చేసింది. ఎదపై చేతులు వేసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసిది. అసలే టాలీవుడ్‌లో బయోపిక్‌ల హంగామా నడుస్తుంది.. ఈ తరుణంలో శ్రీరెడ్డి బయోపిక్ ఏంటో.. అందులో మళ్లీ కొరటాలను ప్రపంచంలోనే పరమ చెత్త క్యారెక్టర్‌గా చూపించడం ఏంటో అని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.