సూరి కేసులో హైకోర్టు సంచలన తీర్పు…!

Hyderabad-Court-Verdict-On-

అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ నేత గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెరువు సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సూరి అనుచరుడు భానుకిరణ్‌‌‌‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది. మరో నిందితుడు మన్మోహన్ సింగ్‌కు ఐదేళ్ల సాధారణ జైలు శిక్షను ఖరారు చేసింది. మిగతా నలుగురు నిందుతలు సుబ్బయ్య, వంశీధర్, వెంకటరమణ, హరిలను నిర్దోషులుగా తేల్చింది. రెండు కేసుల్లో నిందితుడుగా ఉన్న మన్మోహన్‌సింగ్‌కు ఆర్క ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారు చేసింది. ఆయుధాల చట్టం కింద మన్మోహన్‌కు అదనంగా ఐదేళ్ల శిక్ష ఖరారు చేసింది. టీడీపీ నేత పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన సూరిని 2011 జనవరి 4న తన అనుచరుడు భానుకిరణ్ హత్య చేశాడు. హైదరాబాద్‌లోనే సూరితోపాటు కారులో ప్రయాణించిన భానుకిరణ్ యూసుఫ్‌గూడ ప్రాంతంలో నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ హత్య అనంతరం భాను పరారయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ 2012 ఏప్రిల్ 21న జహీరాబాద్ వద్ద భానుకిరణ్‌ను అదుపులోకి తీసుకుంది. సూరి హత్య కేసులో ఆరుగురి పేర్లను పోలీసులు చార్జిషీట్‌లో చేర్చారు. 92మంది సాక్ష్యులను విచారించారు. సూరి హత్య కేసులో సీఐడీ అధికారులు మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారించారు. సూరి కారు డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం, భాను కిరణ్ వద్ద నుంచి సేకరించిన తుపాకికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్, హత్య కేసులో ప్రధాన నిందితుడికి, మిగిలిన నిందితులకు మధ్య హత్య ప్లాన్‌కు సంబంధించిన ఫోన్ సంభాషణల ఆధారంగా కేసు విచారణ పూర్తి చేశారు. బయటకు వస్తే సూరి అనుచరుల నుంచి ప్రాణహాని ఉంటుందన్న భయంతో భానుకిరణ్ బెయిల్ కోసం ఒక్క సారి కూడా పిటిషన్ పెట్టుకోలేదు. మద్దెలచెర్వు సూరినికి భాను కిరణ్ నమ్మినబంటు, బినామీ. సూరి జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున సెటిల్మెంట్లు చేశారు. వ్యక్తిగత విషయాలతో పాటు కోర్టు వ్యవహారాలు, ఆస్తిపాస్తుల నిర్వహణ వంటి అన్ని విషయాలు భానునే చూసేవాడు. సూరి తన ఆస్తులు చాలావరకూ భాను పేరుమీదనే పెట్టాడు. అయితే కొన్ని ఆస్తుల వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడినట్లు బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సూరి గుర్తించాడు. భాను కిరణ్ ను అనుమానించి అతని పేరుపై పెట్టిన ఆస్తులన్నీ తిరిగి తీసుకుంటూండటంతోనే భానుకిరణ్ హత్యకు పాల్పడ్డారు.