వారికి అంత ధైర్యం ఉందనుకోవడం లేదు…!

Sr NTR Wife Lakshmi Parvathi Says About Jr NTR

బాలకృష్ణ ప్రధాన పాత్రలో శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దాదాపుగా పుర్తికావచ్చింది. ఈ చిత్రాని దర్శకుడు క్రిష్ రెండు భాగాలలుగా విడుదల చేయ్యనున్నాడు. మొదటి భాగం కథానాయకుడు పేరుతో విడుదల చేస్తున్నారు. మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్నిచూపిస్తారు, రెండోవభాగం మహానాయకుడు పేరుతో విడుదల చేస్తారు. ఇందులో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్నిచూపించనున్నారు. ఎన్టీఆర్ జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి లక్ష్మి పార్వతి గారు ఇప్పటి వరకు ఆ పాత్ర గురుంచి ఎటువంటి న్యూస్ ఎన్టీఆర్ బయోపిక్ నుండి రాలేదు.

తాజాగా లక్ష్మి పార్వతి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… ఎన్టీఆర్ బయోపిక్ లో నా పాత్ర ఉంటుంది అనుకోవడం లేదు. ఎన్టీఆర్ జీవితంలోకి నేను ఎంట్రీ ఇచ్చిన నుండి బయోపిక్ లో చూపిస్తారు అనుకోవడం లేదు. ఇకా వర్మగారు తెరకెక్కిస్తున్నా లక్ష్మిస్ ఎన్టీఆర్ లో మాత్రం నా పర్మిషన్ అడిగి మరి ఎన్టీఆర్ జీవితాన్ని రూపొందిస్తున్నాడు. సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఎన్టీఆర్ జీవితాన్ని రూపొందించాలంటే నా పర్మిషన్ కావాలని అడిగారంట. లక్ష్మిస్ ఎన్టీఆర్ లో నా పాత్ర కచ్చితంగా ఉంటుందని నేను చెప్పగలను. ఇంకా మీ పాత్రలో ఇప్పటి హీరోయిన్స్ లో ఎవరు నటిస్తే భాగుంటదని అడిగిన ప్రశ్నకు… నేను సినిమాలు అంతగాచూడను కావునా నాకు అలాంటి విషయాలు తెలియవు అన్నారు.