తేజ బయోపిక్ చూడనే లేదట…ఎందుకో !

Teja Strange Comment On NTR Biopic

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ సినిమా తొలుత తేజ దర్శకత్వంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తేజ తప్పుకోవడంతో క్రిష్ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ తీయగలనని పూర్తి నమ్మకం లేకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తేజ చెప్పారు. అయితే ఎన్టీఆర్ తొలి కథానాయకుడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కలెక్షన్ లు మాత్రం అనుకునన్నంతగా రాలేదు. అదీ కాక అన్ని వర్గాల ప్రజలూ ఆదరించక పోవడంతో సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమాపై స్పందనను తెలుసుకునేందుకు మీడియా తేజను కలిసింది. తన తర్వాత సినిమాతో బిజీగా ఉండటంతో బయోపిక్ చూడలేకపోయానన్నాడు తేజ. సినిమా చూసి ఉంటే తన స్పందనను తెలియజేసేవాడినని చూడలేకపోవడం వల్ల కామెంట్ చేయలేకపోతున్నానని ఆయన పేర్కొన్నాడు. అయితే ‘ఎన్టీఆర్’ అభిమానులు మాత్రం సినిమా కోసం మూడు గంటలు కేటాయించలేకపోయావా అంటూ ఆయన మీద సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.