పూరీ సినిమా కోసం బాలీవుడ్ విలన్ !

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుడు సుధాన్షు పాండే తాజాగా పూరీ జగన్నాథ్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడు. ఇటీవల రజనీకాంత్ చిత్రం ‘2.ఓ’లో సుధాన్షు ముఖ్య పాత్ర పోషించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ ఫిబ్రవరి 21 వరకూ జరగనుంది. హీరో రామ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు రియల్ సతీష్ ఈ యాక్షన్ ఎపిసోడ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నాడు. పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తుండగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..