RC16 మూవీ విలన్ ఎవరంటే …. ?

నిన్న పూజా కార్యక్రమాలతో మొదలైన RC 16 సినిమా హాట్ టాపిక్ గా మారుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు.

ఈ మూవీ కి దిగ్గజ నటీనటులతో పాటుగా, సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. ఇప్పుడు విలన్ పాత్ర పై అందరిలో ఆసక్తి నెలకొన్నది . బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కేజీఎఫ్ చాప్టర్ 2 లో పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించారు. ఈ రోల్ కి ఆడియెన్స్ లో సాలిడ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. RC16 కోసం సంజయ్ దత్ ని తీసుకొనే అవకాశాలు కూడా ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉన్నదీ . ఇదే నిజం అయితే మూవీ కి మరింత హైప్ రానుంది. రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా లో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.