మహేష్ వద్దన్నాడు…రాజ్ తరుణ్ చేస్తున్నాడు !

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మేన‌ల్లుడు, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు ఆశోక్ హీరోగా ఆ మ‌ధ్య ఓ సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌గా `ఆడు మ‌గ‌డ్రా బుజ్జి` దైరేక్త్యర్ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ప్రారంభ‌మైంది. కానీ ఎందుక‌నో ఆ ప్రాజెక్ట్ ను ఆపేసారు. మ‌హేష్ కి క‌థ న‌చ్చ‌పోవ‌డంతోనే క్యాన్సిల్ చేసార‌నే రూమ‌ర్లు వినిపించాయి. అందులో నిజ‌మెంత‌న్న‌ది తేలనప్పటికే ఇప్పుడదే సినిమా రాజ్ త‌రుణ్ హీరోగా తెర‌కెక్కించ‌డానికి దిల్ రాజ్ రంగం సిద్ధం చేస్తున్నాడట‌. క‌థ‌లో ఎలాంటి మార్పులు చేయ‌కుండా రాజ్ త‌రుణ్ కు ప‌క్కాగా యాప్ట్ అయ్యే స‌బ్జెక్ట్ అని దిల్ రాజు భుజం త‌ట్ట‌డంతో కృష్ణారెడ్డి ముందుకెళ్ల‌డానికి రెడీ అవుతున్నాడని ఫిలిం నగర్ టాక్. అదే గ‌నుక నిజ‌మైతే రాజ్ త‌రుణ్ ప్లాప్ బండి మ‌ళ్లీ ప‌ట్టాలెక్క‌డం ఖాయం. ఇటీవ‌ల రాజ్ న‌టించిన సినిమా ఏ సినిమా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. దీంతో అవ‌కాశాలు కూడా పెద్దగా రాలేదు. ఈ నేప‌థ్యంలో ఛాంపియ‌న్ అనే సినిమా చేస్తున్న‌ట్లు ప్రచారం లో ఉంది కానీ, ఇంకా ఆ ప్రాజెక్ట్ క‌న్ఫ‌మ్ కాలేదు. ఇదే స‌మ‌యంలో రాజుగారి బ్యాన‌ర్లో మ‌రో సారి ఛాన్స్ అందుకోబోతున్నాడ‌నే వార్త ఆయనకీ కొంచెం ఊర‌ట‌నిచ్చే అంశమే.