హీరో నానికి షూట్ లో గాయాలు !

ఇటీవల హిట్ లు లేక ఇబ్బంది పడుతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. క్రికెట్‌ నేపథ్యంలో మళ్ళీ రావా ఫేం గౌతం తిన్ననూరి దర్శకత్వంలో పిరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూట్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రకీరిస్తుండగా నాని గాయపడినట్టుగా తెలుస్తోంది. క్రికెట్‌ బాల్‌ నాని ముఖానికి తగలటంతో ముక్కుకు, చెంపకు గాయమైందట. అయితే గాయాలు అంత పెద్దవి కాదని, కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం నాని తిరిగి షూటింగ్ కు హజరవుతారని చిత్ర వర్గాల నుండి సమాచారం. ఈ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీ నాథ్ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ సినిమాలో క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కించనున్న సన్నివేశాల్లో పలువురు ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌ నటించనున్నారట.