కరణ్ షోలో ప్రభాస్ గుట్టు రట్టు…!

Baahubali Star Prabhas Accuses Karan Johar Of Starting The Rumour About Him Dating

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలో వచ్చిన చిత్రం బాహుబలి. ఆ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హింది భాషలో విడుదలై మంచి విజయాని దక్కించుకుంది. ముఖ్యంగా హిందిలో ప్రముఖ బడా నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాని ధర్మేంద్ర ప్రొడక్షన్స్ పైన విడుదల చేశాడు. అప్పటి నుండి కరణ్, ప్రభాస్ తో హింది లో ఓ సినిమా చేయించాలని తహతహ లాడుతున్నాడు కానీ ప్రభాస్ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కరణ్ సైలెంట్ గా ఉన్నాడు. కరణ్ నిర్మాతగానే కాకుండా… టీవీ షోస్ కూడా చేస్తుంటాడు అలాంటిది కరణ్ విత్ కాఫీ. కరణ్ ఈ సారి బాహుబలి టీం ను తన ప్రోగ్రాం కు పిలిపించాడు.

తనదైన స్టైల్ లో ప్రశ్నల వర్షం కురిపించాడు. తాజాగా కరణ్ విత్ కాఫీ నుండి ఓ ప్రోమో ను విడుదల చేశాడు. దానికి సంబంధించి ప్రభాస్ ను కరణ్ మీరు ఎవరితోనైనా డేటింగ్ కు వెళ్ళరాని అడిగారు దానికి ప్రభాస్ నో అని సమాధానం చెప్పేశాడు. మరో ప్రశ్నగా మీకు అనుష్క మద్య ఏదైనా సంబంధం ఉన్నదాని అడిగారు. ప్రభాస్ ఆ ప్రశ్నకు సమాధానంగా మీరు కొత్తగా రూమర్స్ పుట్టించవద్దు సర్ అంటూ నవ్వుతు సమాధానం ఇచ్చాడు. అలాగే రాజమౌళి ఆర్ అర్ ఆర్ సినిమా గురుంచి కూడా ఆశక్తికర ప్రశ్నలు. రానా గురుంచి అండ్ లవ్ అఫైర్స్ గురుంచి కరణ్ చాలానే అడిగారంట. ఫుల్ ఎపిసోడ్ కోసం మరికొన్ని రోజులు అగాలిసిందే.