షారుఖ్ ని అడిగే గట్స్ నాకు లేవు – కరణ్ జోహార్

షారుఖ్ ని అడిగే గట్స్ నాకు లేవు – కరణ్ జోహార్
Cinema News

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన గత రెండు చిత్రాలు కూడా సెన్సేషనల్ హిట్స్ గా నిలిచిన సంగతి మనకి తెలిసిందే. అలాగే ఈ సినిమాలతో పాటుగా షారుఖ్ పలు చిత్రాల్లో తాను క్యామియోలో నటించినవి కూడా ఉన్నాయి. మరి ఆ చిత్రాల్లో భారీ చిత్రం “బ్రహ్మాస్త్ర” అలాగే నెక్స్ట్ అయితే “టైగర్ 3” లో కూడా తాను ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తో పాటుగా షారుఖ్ మరో సినిమాలో కూడా క్యామియో కనిపించేవాడట.

షారుఖ్ ని అడిగే గట్స్ నాకు లేవు – కరణ్ జోహార్
Karan Johar And Shah Rukh Khan

అయితే ఆ చిత్రమే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత అయినటువంటి కరణ్ జోహార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. తాను తెరకెక్కించిన రీసెంట్ చిత్రం “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని” చిత్రంలో నేను అడిగితే షారుఖ్ కూడా క్యామియోలో నటిస్తాడు అని కానీ నాకు అతన్ని అడిగేంత గట్స్ లేవు అని కరణ్ జోహార్ తెలిపాడు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.