కల్యాణ్ రామ్ హిట్ కొట్టినట్టే !

118 Movie

కల్యాణ్ రామ్ హిట్ అనే మాట విని చాలా కాలమైంది. పటాస్ సినిమా తర్వాత ఆయన చేసిన అన్ని సినిమాలు నిరాశ పరుస్తూనే ఉన్నా పట్టువదలని విక్రమార్కుడి లాగా ఆయన సక్సెస్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గుహన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి రంగంలోకి దిగిపోయాడు. ‘118’ పేరుతో ఈ సినిమా ఈ నెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కథాకథనాలు, గుహన్ టేకింగ్ ఫొటోగ్రఫీ సినిమాకు ఆడియన్స్ ని రాప్పిస్తున్నాయి. లుక్ పరంగాను నటన పరంగాను కల్యాణ్ రామ్ మంచి మార్కులు కొట్టేశాడు. దాంతో థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5.50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, బయ్యర్ల పెట్టుబడిలో 40 శాతం రాబట్టినట్టు చెబుతున్నారు. తొలివారంలోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో కల్యాణ్ రామ్ కి హిట్ పడిపోయిందనే అంటున్నారు. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు శ్రీవాస్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెప్పుకుంటున్నారు.