హాసిని మళ్ళీ వస్తానంటోంది…!

Genelia Is Ready For South Re Entry

ఒక్కప్పుడు జెనిలియా తెలుగు, తమిళం సినిమాలో నటిస్తూ మంచి పేరును సంపాదించుకుంది. జెనిలియా సౌత్ లో బాయ్స్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి విజయంను దక్కించుకుంది. జెనిలియా నటనతో కుర్ర కారు మనసులను గెలుచుకుంది. అప్పటి నుండి సౌత్ లో ఆమెకు తిరుగులేకుండా పోయింది. తెలుగులో దాదాపుగా ఇప్పుడు ఉన్నా అగ్ర హీరోస్ సరసన నటించింది. తన సినిమా కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలు బాయ్స్, సై, రెడీ, హ్యాపీ, డీ మొదలుగునవి తనను ఇక్కడ హీరోయిన్ గా నిలబెట్టినా చిత్రాలు. ఇంకా బొమ్మరిల్లు చిత్రం తో అల్లరి కథానాయకని పేరును దక్కించుకుంది.

Genelia

ఆ తరువాత చాలానే చిత్రాలు నటించింది కానీ అంతగా ఆడినవి లేవు. సినిమాలో అవకశాలు తగ్గుతున్నవి అనే సమయంలో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ని ప్రేమ వివాహం చేసుకొన్ని జీవితంలో స్థిరపడ్డది. ఇప్పుడు ఆమె ఇద్దరి పిల్లలకు తల్లి గా భాద్యతలు నిర్వర్తిస్తుంది. చాలాకాలం తరువాత మరాఠీ చిత్రం మౌలి లో తన భర్త రితేష్ దేశ్ముఖ్ తో ఓ సాంగ్ లో ఆడింది. దీంతో ఆమె మరల సినిమాలో అవకాశం వస్తే తప్పకుండ నటిస్తాను అని చెప్పింది. ముక్యంగా దక్షణాది నుండి అవకశాలు వస్తే తప్పకుండ నటిస్తాను అని, తెలుగులో మంచి పాత్ర ఏదైనా వస్తే నో చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే జెనిలియా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నది. మరి ఈమెకు అవకాశాలు వచ్చేనా చూడాలి.