అమీర్‌ఖాన్ సినిమాలో హీరోయిన్‌గా జెనీలియా?

అమీర్‌ఖాన్ సినిమాలో హీరోయిన్‌గా జెనీలియా?
Movie News

జెనీలియా అనగానే ముందుగా బొమ్మరిల్లు సినిమా పేరు గుర్తుకొస్తుంది. హీరో కంటే ఎక్కువగా హీరోయిన్ జెనీలియా ని ఎలివేట్ చేస్తూ మూవీ ని బాగా తెరకెక్కించారు. ఇకపోతే బొమ్మరిల్లు సినిమాలో తన అంద చందాలతో పాటు నటనతో కూడా ప్రతి ఒక్కరిని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ తన యాక్టింగ్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

అమీర్‌ఖాన్ సినిమాలో హీరోయిన్‌గా జెనీలియా?
Genelia, Aamir Khan

అయితే.. కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ జెనీలియాకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా అమీర్ ఖాన్ కొత్త సినిమా సితారే జమీన్ పర్ లో జెనీలియా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇక ఆమె కెరీర్ వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. కాగా, ఈ ఏడాది వేద్ మూవీ తో జెనీలియా రీఎంట్రీ ఇచ్చారు. తెలుగు మజిలీ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.