పిక్ టాక్: అల్లు అర్జున్ కూతురు అర్హ రెండో పుట్టినరోజు

Allu Arjun Daughter Allu Arha 2nd Birthday Celebration

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫ్రెండ్లీ హీరోనో అంతే ఫ్యామిలీ హీరో కూడా. పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనడంలో రామ్ చరణ్ లాగ లేట్ చేయకుండా, వెంట వెంటనే ఇద్దరు పిల్లల్ని కన్నారు అల్లు అర్జున్ మరియు అతని భార్య స్నేహలత. ఆ ఇద్దరి పిల్లల పేర్లు అయాన్ మరియు అర్హ. అటు సినిమాలతో బిజీ గా ఉంటూనే తన ఫ్యామిలీ కి సంబంధించిన విషయాలను పోస్ట్ ల రూపంలో సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటుంటాడు. ఒక్కసారి అల్లు అర్జున్ సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే చాలు అతని జీవితంలో జరిగిన ముఖ్యమైనవి అన్నింటిని తన అభిమానులతో పంచుకుంటూ ఉండడం కనిపిస్తుంది.

allu-arjun
ఇక అసలు విషయానికి వస్తే, అల్లు అర్జున్ మరియు స్నేహలత ల కూతురు అర్హ తన రెండవ పుట్టినరోజును ఈరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ షేర్ చేసిన అర్హ పుట్టినరోజు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్ని నవ్వులతో ముద్దొచ్చే అర్హ ని చూడగానే ఇష్టపడడం ఖాయం. నీలం కలర్ బేబీ ఫ్రాకులో అర్హ తణుకులీనుతుంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత అల్లు అర్జున్ ఇంకా ఏ సి సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సైరా సినిమాలో మాత్రమే నటిస్తున్నారు.