పిక్ టాక్: మోహన్ లాల్ ఒడియన్ ఫస్ట్ లుక్ అదిరింది

Mohanla Odiyan Telugu Movie First Look

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా మంచి క్రేజ్ లభించింది. ఆయన నటించిన మన్యంపులి, కనుపాప అనే అనువాద సినిమాలు తెలుగులో కూడా మంచి విజయం సాధించాయి. అంతేకాకుండా, తెలుగు లో చేసిన స్ట్రెయిట్ సినిమాలైన మనమంతా, జనతా గ్యారేజ్ లు మంచి పేరు ని తెచ్చిపెట్టి, మోహన్ లాల్ ని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.మోహన్ లాల్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ఒడియన్’. ఈ సినిమాలో మోహన్ లాల్ 30 ఏళ్ళ యువకుడిగా, 55 ఏళ్ళ వ్యక్తిగా రెండు విభిన్న పాత్రలను పోషించారు. ఇందుకోసం రోజులతరబడి జిమ్ గడుపుతూ, యోగ కూడా చేస్తూ 30 ఏళ్ళ యువకుడిగా కనపడేందుకు చేయాల్సినవన్నీ చేశారు.

Mohanla-Odiyan-Telugu-Movie

మోహన్ లాల్ కి తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా, అంతేకాకుండా ఈ సినిమాలో గ్రాఫిక్స్ భారీతనం కూడా ఎక్కువగా ఉండడంతో, ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని దగ్గుబాటి ఫామిలీ కి చెందిన దగ్గుబాటి అభిరామ్ (రానా తమ్ముడు) మరియు సంపత్ కుమార్ లో ఈ సినిమా తెలుగు అనువాద హక్కులను చేజిక్కుంచుకొని, ఒడియన్ అనే టైటిల్ తోనే తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మరో ముఖ్యపాత్ర పోషిస్తుండగా, మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి దర్శకత్వం వి. ఏ. శ్రీకుమార్ మీనన్ వహిస్తున్నారు. మలయాళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో డిసెంబర్ 14 న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.

mohanlal