‘విజేత’ను పవన్‌ పట్టించుకోక పోవడానికి కారణం ఇదే!

Reason Behind pawan not attend For vijetha promotions

మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆశించిన స్థాయిలో విజేత ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఈ చిత్రానికి చిరంజీవి, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి మెగా స్టార్‌ హీరోలు ప్రమోషన్స్‌కు వచ్చారు. కాని పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఈ చిత్రంను పట్టించుకోలేదు. దాంతో మీడియాలో పవన్‌ కళ్యాణ్‌కు కళ్యాణ్‌ అంటే పెద్దగా అభిమానం లేదు అని, అందుకే విజేత ప్రమోషన్స్‌లో ఆయన కనిపించలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ పవన్‌ విషయంలో వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు.

చిన్నమామయ్య పవన్‌కు తాను అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని, కాకుంటే తాము పవన్‌ మామయ్యను ప్రమోషన్స్‌కు తీసుకు రావాలనుకోలేదు. ఆయన రాజకీయాలతో చాలా బిజీగా ఉండటం వల్ల చిత్రం కోసం ఆయన్ను ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. పవన్‌ మామయ్యను ప్రమోషన్స్‌ కోసం పిలిస్తే తప్పకుండా వచ్చేవాడు అని, కాకుంటే మామయ్యను వద్దనుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. మామయ్య ఆశీస్సులు ఎప్పటికి తనకు ఉంటాయని పేర్కొన్నాడు. విజేత చిత్రం సక్సెస్‌ అయితే ఆ సక్సెస్‌ మీట్‌కు పవన్‌ను తీసుకు రావాలని చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు మెగా ఫ్యామిలీ అనుకున్నారు. కాని అనూహ్యంగా సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో పవన్‌తో అవసరం రాలేదు. కళ్యాణ్‌ రెండవ చిత్రానికి అయినా కళ్యాణ్‌ వస్తాడని మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు.