శ్రీరెడ్డికి ప్రముఖ తమిళ ఫిల్మ్‌ మేకర్‌ రహస్య మద్దతు

tamil film maker support on sri reddy

మొన్నటి వరకు తెలుగు సినిమా ప్రముఖులపై మాటల యుద్దం చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమపై పడటం జరిగింది. మురుగదాస్‌, శ్రీకాంత్‌, లారెన్స్‌తో పాటు ఇంకా పలువురు తమిల ప్రముఖులను శ్రీరెడ్డి టార్గెట్‌ చేస్తుంది. ఇప్పటికే లారెన్స్‌పై ఈమె చేసిన విమర్శలు పతాక స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా ఈమె చెన్నైకు వెళ్లడం చర్చనీయాంశం అవుతుంది. ఉన్నపళంగా శ్రీరెడ్డి చెన్నైకు వెళ్లడం వెనుక కారణం ఏంటీ, అక్కడ ఈమెకు మద్దతుగా నిలుస్తున్నది ఎవరు అంటూ చర్చ జరుగుతుంది. గతంలో చెన్నైకు ఎప్పుడు వెళ్లని శ్రీరెడ్డికి అక్కడ నుండి ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మేరకు శ్రీరెడ్డి వెళ్లింది. శ్రీరెడ్డితో ఒక తమిళ సినీ ప్రముఖుడు విమర్శలు చేయిస్తున్నట్లుగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

శ్రీరెడ్డితో సదరు తమిళ ఫిల్మ్‌ మేకర్‌ మాట్లాడి తనకు విరోదులు అయిన వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన డైరెక్ట్‌గా శ్రీరెడ్డిని కలవకుండానే ఫోన్‌ ద్వారా ఆమెతో మాట్లాడుతూ, ఆమెను నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమిళ వెబ్‌ మీడియాలో ఈ విషయమై కథనాలు వస్తున్నాయి. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల వల్ల పలువురు సినీ ప్రముఖుల పరువు పోవాలనేది ఆయన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఇటీవల శ్రీరెడ్డికి మద్దతుగా ఒక తమిళ సినీ ప్రముఖుడు బహిరంగంగానే మాట్లాడటం జరిగింది. ఆయనేనా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీరెడ్డి ఇంకెంత మంది తమిళ సినీ ప్రముఖులను టార్గెట్‌ చేస్తుందో చూడాలి.