కత్తి అక్కడ కూడా అంతేనా !

Police stop Kathi Mahesh press meet

కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ చేసిన విషయం తెల్సిందే. హిందు సమాజంపై, రాముడు, రామాయణంపై తీవ్ర స్థాయిలో కత్తి మహేష్‌ వ్యాఖ్యలు చేయడం, అందువల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగడం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఆయనకు నగర బహిష్కరణ చేశారు. హైదరాబాద్‌లో ఆరు నెల వరకు అడుగు పెట్టవద్దంటూ పోలీసులు ఆదేశాు జారీ చేయడం జరిగింది. కత్తి మహేష్‌ను పోలీసులు తీసుకు వెళ్లి చిత్తూరు జిల్లా పోలీసులకు అప్పగించడం జరిగింది. చిత్తూరులోనే ఉన్న కత్తి మహేష్‌ విజయవాడ లేదా గుంటూరు కూడా వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. చిత్తూరు దాటి వెళ్లవద్దంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ఏపీ పోలీసులు తాజాగా మీడియా సమావేశంకు కూడా నో చెప్పారు.

కత్తి మహేష్‌ గత కొన్ని రోజులుగా మీడియా వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా మీడియాకు ఆహ్వానం పలికాడు. మీడియా సమావేశంకు రావాలంటూ అందరిని పిలవడంతో కాస్త హై టెన్షన్‌ నెలకొంది. ఈ సమయంలో కత్తి మహేష్‌ మీడియా సమావేశంకు అనుమతి లేదు అంటూ పోలీసులు తేల్చి చెప్పారు. మీడియా వారు కత్తి మహేష్‌ ప్రెస్‌ మీట్‌కు వెళ్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, కత్తి మహేష్‌కు సంబంధించిన ఎలాంటి కథనాలు వచ్చినా కూడా టీవీ ఛానెల్స్‌పై కేసులు నమోదు అవుతాయి అంటూ ఈ సందర్బంగా పోలీసులు ఆంక్షలు విధించారు. దాంతో కత్తి మహేష్‌ చేతులు కట్టేసినట్లుగా ఉన్నాయి. ఒక వైపు హైదరాబాద్‌లో అడుగు పెట్టకుండా అధికారికంగా ఆంక్షలు, ఇక వైజాగ్‌, గుంటూరు, విజవాడలో అడుగు పెట్టకుండా అనధికారిక ఆంక్షలు ఉన్న నేపథ్యంలో కత్తి మహేష్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాజకీయంగా బలపడాలని భావించిన కత్తి మహేష్‌కు ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు.