వీడు మగాడ్రా బుజ్జీ…

ajay bhupathi created new era in tollywood industry

ఎందుకో ఏమో తెలీదు కానీ సాధార‌ణంగా అబ్బాయిలు అమ్మాయిల్ని వాడుకుని వ‌దిలేసిన‌ట్టు చూపిస్తారు మన తెలుగు సినిమాల్లో. అమ్మాయిలు అబ్బాయిలని వాడుకుని వదిలేస్తారు అనే విషయం నూటికి 90శాతం మందికి తెలిసినా అదేమి ఖర్మో గానీ స్త్రీ అన్నపదానికి సాగిలపడి అబ్బాయిదే తప్పు అన్నట్టు ప్రవర్తిస్తారు మన పెద్దలు సహా తెలుగు డైరెక్టర్ లు, రచయితలూ మరి అమ్మాయిలు చేసే తప్పు ఎత్తి చూపిస్తే జనాలు ఒప్పుకోరేమో అని ఒక భావన అయ్యుండచ్చు. కానీ RX 100 దర్శకుడు అజయ్ అలా అనుకోలేదు. సినిమా సరిగా ఆడకపోతే గేదెలు మేపుకుందామని నిర్ణయించుకున్నాకే ఈ సినిమా చేశానని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బహుశా ఇలా రెండు సందర్భాల్లో ఇవ్వచ్చు. ఒకటి సినిమా మీద భీబత్సమైన కాన్ఫిడెన్స్ అయినా అయ్యుండాలి, లేదా భీబత్సమైన బలుపు అయినా అయ్యుండాలి. వర్మ శిష్యుడు కాబట్టి బహుసా రెండో కోవకే చెందినా వ్యక్తి అని భావించి, రొటీన్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాను చూడొద్దు అన్న అజయ్ భూపతి మాటలని నాకు తెలిసిన చాలా మంది ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తులు బలుపే అనుకున్నారు. మొదటి సినిమాకే ఇలా స్టేట్మెంట్లు ఇస్తే కష్టం రా అబ్బాయ్ అని పెదవి విరిచిన వాళ్ళూ ఉన్నారు. కానీ సినిమా హిట్ కొట్టింది, ఇప్పుడు బలుపు అన్న ఆ నోళ్లె ఇప్పుడు కాన్ఫిడెన్స్ అంటున్నాయి. ఎంత మార్పో రెండు రోజుల్లో.

సినిమా విషయానికి వస్తే మనకు తెలుగు సినిమాల్లో మగ క్యారెక్టర్ లు హీరోయిన్ నో లేక ఆడ క్యారెక్టర్ నో చూసి ప్రేమించడమో, కామించాడమో చూశాం, చూస్తున్నాం, చూస్తూనే ఉంటాం ఎందుకంటే ఆ సీన్ రివర్స్ చేసి చూపలేం. ఒక వేల చేసినా ఎదో ఈవీవీలాగా కామెడీ జంబ లకిడి పంబ తీసి సరిపెట్టుకున్నాం. ఎందుకంటే ఒక సూపర్ హిట్ సినిమాలో సాంగ్ లో హీరోయిన్ దుస్తులు హీరో తొలగిస్తేనే మహిళా సంఘాలు గగ్గోలు పెట్టె సమాజంలో ఉన్నాం కనుక. కానీ RX 100 నిజాన్ని చూపడానికి ఎటువంటి బెరుకూ లేకుండా అడుగు ముందుకు వేసింది. సినిమా ఫ్లాష్ బ్యాక్ లో హీరో కండ‌ల్ని చూసి ప‌డిపోయిన హీరోయిన్ లుక్ ని కాస్త గమనిస్తే హీరోయిన్ మోటివేష‌న్ బాగా అర్థ‌మైపోయి ఉంటుంది. అది లవ్ కాదు లస్ట్ అని. అక్క‌డ వ‌ర‌కూ సరదా ప్రేమకధలా సాగిన కధనంలో హీరోయిన్ క్యారెక్ట‌రైజేష‌న్‌లో ఇచ్చిన ట్విస్టుకు క‌చ్చితంగా షాక్ అవుతారు. ఈ క‌థ న‌డ‌వ‌డిక‌ను పూర్తిగా మార్చేసిన సంద‌ర్భం అది. ఈ క‌థ‌పై, ద‌ర్శ‌కుడిపై ఉన్న అనుమానాన్ని, అప‌న‌మ్మ‌కాన్ని ఆయా సన్నివేశాలు తుడిచి పెట్టుకుపోయేలా చేస్తాయి. అస‌లు అమ్మాయిలు ఇలాక్కూడా ఉంటారా, ఇలాక్కూడా ఆలోచిస్తారా? అనేట్టు చేశాయి. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా రియ‌లిస్టిక్‌గా సాగాయి. ఈ సినిమా చేయడానికి హీరో హీరోయిన్ లకు గట్స్ ఉన్న లేకపోయినా దర్శక నిర్మాతలకి గుండె నిండా ధైర్యం కావాలి ఎందుకంటే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మిగతా వారికీ పర్లేదు కానీ దర్శక నిర్మాతల పరిస్థితి వేరు. నిజంగా ఇటువంటి కదా తీసుకుని ప్రేమ మోజులోపడి విలువైన తన జీవితాన్ని, తల్లిదండ్రులని పోగొట్టుకుంటున్న ఎంతో మంది ప్రేమ బాదితులకి ఈ సినిమా కనువిప్పు కావాలని కోరుకుంటున్నాం.

నోట్ : మాకు స్త్రీల పట్ల చాలా గౌరవం ఉంది, కానీ ఇలా అవసరాలకి వాడుకుని వదిలేసి ఎంతో మంది యువకులని పొట్టన పెట్టుకున్న పెట్టుకుంటున్న మహిళలు ఇప్పటికయినా మారతారు అనే మాయీ చిరు ప్రయత్నం.

Bhargav Chaganti